రజనీని మెప్పించింది

ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు అనుష్కపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘భాగమతి’ సినిమా చూసిన తర్వాత తన భార్య ఉపాసనకు నిద్రపట్టలేదని రామ్‌చరణ్‌ ఫేస్‌బుక్‌ వేదికగా పేర్కొన్నారు. కాగా, అనుష్క తాజాగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఇప్పటి వరకు మీకు అందిన ప్రశంసల్లో ఉత్తమమైనది ఏది?’ అని అడిగిన విలేకరి ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘రజనీకాంత్‌ ఫోన్‌ చేశారు. ‘భాగమతి’ సినిమా చాలా నచ్చింది అన్నారు. మనం ఓ సినిమా చేయడం.. సూపర్‌స్టార్‌ ఫోన్‌ చేసి అలా అభినందించడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డి, నా స్నేహితులు కూడా శుభాకాంక్షలు చెబుతూ సందేశాలు పంపారు’’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com