రజనీ అభిమానుల చర్యతో కలకలం

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు గోడపత్రికలు అంటించి కలకలం సృష్టించారు. చెన్నై, తిరుచ్చి, మదురై తదితర పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు భారీ ఎత్తున ఈ గోడపత్రికలను అంటించి తమ కోర్కెను వెల్లడించారు. రజనీ అభిమానుల సంఘం తిరుచ్చి జిల్లా నిర్వాహకుడు రాయల్‌ రాజు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రజామద్దతు ఉన్న నాయకులెవరూ లేరని రజనీకాంత్‌ మాత్రమే ఆ స్థానాన్ని భర్తీ చేయగలరని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిజాయితీ పాలనను ఆయన మాత్రమే అందించగలరన్నారు. ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన రాజకీయాల్లోకి రావాలన్నారు. రాష్ట్రంలోని అన్ని అభిమాన సంఘాల వారు ఈ విషయమై ఆయనను కలిసి విజ్ఞప్తి చేయనున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతి పేరుకుపోయిందని, అల్లర్లు పేట్రేగుతున్నాయన్నారు. వీటిని అణచి వేసేందుకు రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావడం ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com