రజనీ ముఖ్యమంత్రి అవుతాడు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి అవుతారని ఎంఎన్‌ఎం అధినేత కమల్‌హాసన్‌ సోదరుడు చారుహాసన్‌ జోస్యం చెప్పారు. శనివారం ఆయన ఫేస్‌బుక్‌ పోస్టు ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రజనీకాంత్‌ను కన్నడిగుడని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారికి ఆయన పరిపూర్ణ విజయంతో సమాధానం లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు రజనీతో పోల్చుకుంటే కమల్‌కు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. కమల్‌హాసన్‌ను ప్రజలు మంచి నటుడిగా చూస్తారని, రాజకీయ పరంగా మాత్రం ఆ స్థాయి మద్దతు ఉండదని అభిప్రాయపడ్డారు. చారుహాసన్‌ మొదటి నుంచీ రజనీకే మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com