రష్యాలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

సామ్యవాదానికి పుతీనిల్లు..పరిణామంలో ప్రపచ్నఃమ్లోనే అతిపెద్ద దేశం రష్యా ఏంటో చారిత్రిక నేపద్యమున్న ఆ దేశం వెళ్ళినపుడు పార్యతకులు గమనించాల్సిన విషయాలేమిటో చూద్దాం..
**మర్యాదలు ముఖ్యం
రష్యన్లు సంప్రదాయాలను ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. పర్యాటకులు సహా అందరూ వాటిని పాతిచ్నహలని కోరుకుంటారు. ఉదాహరణకు రష్యా చలి దేశం. అయినా ఇతరులకు షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో గ్లోప్స్ తీస్తారు. గ్లోప్స్ తీయకపోతే అవమానకరంగా భావిస్తారు. ఇదే విధంగా ఎవరినైనా బయటకు తీసుకువెళ్తే ఆహ్వానించిన వారే హోటల్ బిల్లును కట్టాలి. లేకపోతె తమ మర్యాదకు భంగం కలిగింట్లు భావిస్తారు. వీటన్నిటితో పాటుగా రష్యన్లు ఇతరులతో ఎక్కువగా మాట్లాడారు. ఎక్కువ నవ్వారు. పర్యాటకులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. బస్సుల క్యూలలోను ఇతర ప్రాంతాలలోను వృద్దులకు ప్రాదానయమివ్వాలి. వారికి సాయం చేయాలి. చాలా మంది రష్యన్లు తమ ఇళ్ళను మంచి మంచి కర్పెట్లతో అలంకరించుకుంటారు. అందువల్ల ఎవరి ఇంటికైనా వెళ్ళినపుడు మనం ధరిచ్న్హిన బూట్లను వదిలి లోపలి వెళ్ళాలి. పార్టీలకు వెళ్ళినపుడు కొందరు తాము ఇళ్లలో వేసుకునే చెప్పులను పట్టుకెళ్ళి.. పార్టీ ఇస్తున్న వారి ఇంట్లో వేసుకుంటారు. అతిధుల కోసం చాలా మంది ప్రత్యేకంగా చెప్పులను ఉంచుతారు. ఇది కొన్ని శతాబ్దాల నుంచి వస్తున్నా ఆచారం.
**హోటల్ కు వెళ్తే..
రష్యాలో రెస్టారెంట్ లో ఎవరూ కార్నర్ సీట్లలో కూర్చోరు. చిన్న రెస్టారెంట్ అయినా పెద్ద రెస్టారెంట్ అయినా కార్నర్ సీట్లు ఖాళీగానే కనిపిస్తాయి. కార్నర్ సీట్లలో కూర్చుంటే ప్రేమించినవారు దూరమవుతారని రష్యన్లు నమ్ముతారు. అందుకే కార్నర్ సీట్లలో కూర్చోవటానికి ఇష్టపడరు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com