రష్యా అమ్మాయిని ఫేస్‌బుక్‌లో ఇండియా పిలిచి మరీ అత్యాచారం చేసిన బ్యాంక్ మేనేజర్?

రష్యాకు చెందిన మహిళపై ఓ బ్యాంకు మేనేజర్ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యూకో బ్యాంకు(బృందావన్ బ్రాంచ్) మేనేజర్ మహేంద్ర ప్రసాద్ సింగ్.. ఫేస్‌బుక్ ద్వారా రష్యాకు చెందిన 20 ఏళ్ల యువతితో గతేడాది నవంబర్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇండియాకు రావాలని యువతిని బ్యాంకు మేనేజర్ ఆహ్వానించాడు. ఆయన ఆహ్వానంతో ఆ యువతి ఇండియాకు ఈ ఏడాది సెప్టెంబర్ 17న వచ్చింది. టెంపుల్ టౌన్ అయిన బృందావన్‌లో రష్యా యువతి ఉంటోంది. ఇక బ్యాంకు మేనేజర్.. ఆవిడను ఈ నెల 22న కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పట్నుంచి చాలాసార్లు తనపై అత్యాచారం చేశాడని.. బాధిత యువతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బ్యాంకు మేనేజర్‌ను అరెస్టు చేశారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్ స్పందించాడు. రష్యా యువతికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. తనను ఆమె డబ్బులు అడిగిందన్నారు. డబ్బులు ఇవ్వనని తిరస్కరించడంతో.. తనపై కేసు పెట్టిందని బ్యాంకు మేనేజర్ తెలిపాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com