రాజకీయాలకు ఓ దణ్ణం

ప్రత్యేకహోదా ఉద్యమానికి సినీ పరిశ్రమ దూరంగా లేదన్నారు ప్రముఖ సినీనటుడు జగపతిబాబు. ఈ అంశంపై అవసరమొచ్చినప్పుడు స్పందించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజాలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆయన శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. గతంలో కొందరు నేతలు తనను రాజకీయాల్లోకి ఆహ్వానించారని.. అయితే తనకు ఆ ఆలోచన లేదన్నారు. సినిమాల్లో ఎలాంటి పాత్రలొచ్చినా నటించడానికి సిద్ధమేనని.. అవసరమైతే గుండుతో నైనా నటిస్తానని జగపతిబాబు చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com