రాజకీయ కలకలం రేపుతున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం–TNI ప్రత్యేకం

పేరుకు తగ్గట్టుగానే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాలను కేంద్ర బిందువుగానే ఉంటుంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెదేపా ఎమ్మెల్యే భూ కుంభకోణం వ్యవహారంలో చిక్కుకుని రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి వర్గం విస్తరణ సందర్భంగా ఎదురు తిరిగిన బొండా ఉమా ప్రస్తుతం భూ దందాలో ఇరుక్కు పోయారు. వచ్చే ఎన్నికల్లో బొండా ఉమాకు తెలుగుదేశం టిక్కేట్ ఖచ్చితంగా వస్తోందన్న ధీమా కూడా ఆయనకు లేదు. 2014లో విజయవాడ తూర్పు నుంచి వైకాపా అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయినా వంగవీటి రాధా.. 2019 ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాదా నిర్ణయించుకున్నారు. వైకాపా నాయకత్వం కూడా సెంట్రల్ నియోజకవర్గ ఇన్ చార్జి గా వంగవీటినే నియమించింది. అంతా సక్రమంగానే ఉందనుకుంటున్న తరుణంలో మల్లాది విష్ణు వైకాపా గూటికి చేరడంతో సందిగ్దం తలెత్తింది. గతంలో సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా రెండు సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచారు మలల్ది. దీంతో వైకాపా నుంచి మలాది సెంట్రల్ అభ్యర్ధిగా పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఇది రాధాని మరింత ఆగ్రహం తెప్పించాయి. కాపు సామాజికవర్గం తీవ్రంగా ప్రతి స్పందించింది. దీంతో గౌతమ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైకాపా. రాధా కూడా కొద్దిగా శాంతించారు. అంతా సర్దుమనుగుతుందని భావిస్తున్న సమయంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో డివిజన్లకు కన్వినర్లుగా మల్లాది విష్ణు అనుచరులను నియమిస్తున్నట్లు వైకాపా ప్రకటించింది. దీంతో రాధా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైకాపాని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం కూడా జరిగింది. వార్తలను ఖండించిన రాధా. ..వైకాపా అభ్యర్ధిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి చూపిస్తానని శపథం చేసారు. రాధా దూకుడుగా వెళతారు అనుకున్న నేపద్యంలో రాధా ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడన్నది చర్చనీయంశంగా మారింది. ఈరోజు గౌతమ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీచేయడం ఎల్దని వంగవీటి రాధాకు తన పూర్తీ మద్దతు ఉంటుందని ప్రకటించారు. మొతం మీద విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో జరగబోయే పోటీతో పాటు ఎన్నికలకి ముందు ఏర్పడే పరిణామాల పైనా రాష్ట్రం అంతటా ఆసక్తి కరంగా ఉంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com