రాజస్థాన్‌లో రజనీ విగ్రహం

‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌కు ఎల్లలులేని అభిమానులు ఉన్నారు. పా రంజిత్‌ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం ‘కాలా’. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అభిమానులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ జయపుర నహర్‌గఢ్‌ కోటలోని మైనపు మ్యూజియంలో రజనీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘కాలా’ విడుదల రోజునే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం గమనార్హం. జయపురలో ఆవిష్కరించిన రజనీ మైనపు 55 కిలోల బరువు ఉండగా, 5 అడుగుల 9 అంగుళాల ఎత్తులో దీనిని రూపొందించారు. వాంగ్‌ పింగ్‌, సుశాంత రే బృందం మూడు నెలల పాటు కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు మ్యూజియం వ్యవస్థాపకులు అనూప్‌ శ్రీవాత్సవ తెలిపారు. ‘తమిళనాడుకు చెందిన పర్యాటకులు రజనీ విగ్రహాన్ని తయారు చేయాల్సిందిగా కోరారు. అందుకే రూపొందించాం’ అని శ్రీవాత్సవ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మ్యూజియంలో మైనపు విగ్రహాల సంఖ్య 36కు చేరుకుంది. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో 1999లో వచ్చిన ‘నరసింహ’లోని స్టైల్‌తో రజనీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ‘జయపుర మైనపు మ్యూజియాన్ని వీక్షించాల్సిందిగా రజనీ సర్‌కు ఆహ్వానం పంపాం. మరి ఆయన మా ఆహ్వానాన్ని మన్నిస్తారో లేదో చూడాలి’ అని శ్రీవాత్సవ తెలిపారు. త్వరలోనే షారుక్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ విగ్రహాలను తయారు చేయనున్నట్లు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com