రాయల నగలు ఎక్కడ?

**తిరుమల శ్రీవారి నగల విషయమై.. ఉద్యోగ విరమణ చేసిన ప్రధానార్చకుడు రమణ మహర్షి చేసిన విమర్శలు అర్ధరహితమైనవని రూఢి అవుతోంది. తిరుమల శ్రీవారికి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన నగలు కొన్ని కనపడటం లేదని, కెంపు వజ్రం జెనీవాలో వేలం వేశారని, సిబిఐ విచారణ జరిపితే సమాచారం వెలుగులోకి వస్తుందని ఇటీవల రమణ దీక్షితులు డిమాండ్‌ చేశారు. ఈ నేపధ్యంలో శ్రీకృష్ణదేవరాయులు తిరుమల స్వామి వారికి ఏమేమి నగలు ఎప్పుడెప్పుడు ఇచ్చారనే వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి కలగడం సహజం. రాయల వారు తన దేవేరులతో (భార్యలతో) కలిసి మొట్టమొదట క్రీస్తుశకం 1513 ఫిబ్రవరి 10న తిరుమలను దర్శించారు. ఆ సమయంలో రత్న కిరీటం, నగలు, బంగారు కప్పులు, ప్లేట్లు, విలువైన రాళ్లు ఆయన సమర్పించారు. అదే ఏడాది మే 2న అత్యంత విలువైన తొమ్మిది సెట్ల బంగారు ఆభరణాలు సమర్పించారు. 1514 జూలై 6న శ్రీకృష్ణదేవరాయలు స్వామి వారిని దర్శించి 30 బంగారు వరహాలతో కనకాభిషేకం నిర్వహించారు. తొమ్మిది రకాల వజ్రాలు పొదిగిన నవరత్న ప్రభావళి సెట్‌ను శ్రీవారికి బహూకరించారు. 1517 జనవరి 2న 30 వేల వరహాలను అభయారణ్యం వద్ద ఏర్పాట్లకు కేటాయించారు. 1518 అక్టోబర్‌ 16న తనకు పుట్టిన బిడ్డ, మహా రాణితో కలిసి దర్శనం చేసుకున్నారు. 1521 ఫిబ్రవరి 17న రాయలవారు తుది పర్యటనను తిరుమలలో జరిపారు. పీతాంబరం సెట్‌, ముత్యాల టోపి, కెంపులు, వెయ్యి వరహాలు సమర్పించారు. ఎంతో బరువైన బంగారు ఆభరణాలు, 2,822 శుద్ధి చేయబడ్డ కెంపులు, 160 వైడూర్యాలు, 423 పాత వజ్రాలు ఉన్నాయి. రాయలవారు స్వామికి సమర్పించిన వాటిలో పలు కిరీటాలు, నెక్‌లెస్‌లు మాణి క్యాలు కూడా ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రతి వారం జరిగిన కృషిని శుక్రవారం నాడు శాసనా లుగా తయారు చేసేవారు. రాయల వారి హయాంలో రాయించిన రాతి శాసనాల్లో స్వామివారికి అందించిన ఆభరణాల వివరాలున్నాయి. వాటి ఆధారంగా టిటిడి తయారు చేసిన జాబితాను చూడొచ్చు.
**కొన్ని నగలను కరిగించి ఆలయ ఖర్చులకు వాడారా?
శ్రీకృష్ణ దేవరాయలు స్వామికి సమర్పించిన ఆభరణాలు ప్రస్తుతం కనిపించటం లేదు. ప్రభావళి, కిరీటము, కత్తి మాత్రమే మిగిలిఉన్నాయి. కనపడలేదనే విషయం టిటిడి ప్రస్తుత అధికారులు, యాజమాన్యం పరిధిలో లేదు. 350 ఏళ్ల కిందటి సమస్య ఇది. టిటిడి ప్రచురించిన ప్రాచీన పుస్తకాలలో సైతం వీటి ప్రస్తావన ఉంది. తిరుమల చరిత్రము అనే పుస్తకంలో టికెటి వీర రాఘవాచార్యులవారు ఈ అంశాలన్నీ ప్రస్తావించారు. 1978లో టిటిడి ప్రచురించిన ఈ పుస్తకంలో చాలా వివరాలున్నాయి. తిరుమల ఆలయ వ్యవహారాలు చూసే నాటి మఠం పెద్దలు, పరిపాలకులు కొన్ని నగలను కరిగించి ఆలయ ఖర్చులకు ఉపయోగించారని కొన్ని నగలు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు.
**1820 వరకూ నగలపై నిర్దిష్ట విధానం లేదు..
1820 వరకూ ఆలయ నిధులు, నగలకు ఒక నిర్ధిష్ట విధానం అనుసరించలేదు. 28.7.1821న అప్పటి జిల్లా కలెక్టర్‌ ‘బ్రూస్‌ కోడ్‌’ అనే పేరుతో దేవాలయ పరిపాలనను మొట్టమొదటగా ప్రవేశపెట్టారు. క్రీస్తుశకం 1821 నుండి దేవాలయ పరిపాలనను క్రమబద్ధం చేశారు. ”పారుపత్తేదార్‌ అమలునామా” అనుదినచర్య పుస్తకములో దేవాలయంలో జరిగే అన్ని కార్యకలాపాలను పొందుపరచాలని నిర్ణయించి అమలు జరిపారు. ఆ తరువాత 1843లో ఈస్టిండియా కంపెనీ మహంతులకు పరిపాలనా బాధ్యతలు అప్పగిం చింది. మహంతుల పాలన 1933 వరకు సాగింది. 1933లో నాటి మద్రాసు ప్రభుత్వ హయాంలో టిటిడికి స్వతంత్ర ప్రతిపత్తిగల ధర్మకర్తల మండలి ఏర్పడింది.
**1951లో ధర్మకర్తల మండలి నియామకం
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951లో ధర్మ కర్తల మండలిని నియమించారు. కార్యక్రమాల నిర్వహ ణకు మొదటి కార్యనిర్వహణాధికారిగా చెలికాని అన్నారా వును నియమించారు. అన్నారావు ఆధ్యర్యంలో మొదటి సారిగా తిరుమల వెంకన్న ఆభరణాలను లెక్కగట్టి నమోదు చేయించారు. ఆ సందర్భంగానే శ్రీకృష్ణదేవరా యలు ఇచ్చిన ఆభరణాలు లేవని తేల్చారు.నగల లెక్కిం పుపై తరువాత కాలంలో వాద్వా కమిటి, జస్టిస్‌ జగన్నాధ కమిటీలు మొత్తం పరిశీలించి నగలు సక్రమంగా ఉన్నాయిని తేల్చారు. జగన్నాధ కమిటీ ఈ పరిశీలనకు సుమారు రూ.40 లక్షల ఖర్చు చేసింది. ఆభరణాల విషయం ఇంత స్పష్టంగా ఉన్నా రమణ దీక్షితులు ఎందుకని శ్రీకృష్ణ దేవరాయలను ముందుకు తెచ్చారు. దీని వెనుక ఉన్న కుట్ర కోణం ఏమిటో చూడాలి.
(రమణ దీక్షితులు వెనుక సంఘ్‌ పరివార్‌.. రేపటి కథనంలో)
**శ్రీకృష్ణ దేవరాయలు శ్రీవారికి సమర్పించిన బంగారు నగలివే
**10-2-1513
*నవరత్న కిరీటం.
*మూడు పలకల నెక్లెస్‌
* కర్పూర హారతికి 25 వెండి పళ్లెములు
* ఏకాంత సేవలో పాలు నింపడానికి బంగారపు గిన్నె
**02-05-1513
*రత్నములతో కూడిన కంఠాభరణాలు
* రత్నాలు కూర్చబడిన ఒరతో కలిపిన కత్తి.
* ఎర్రలు, పచ్చలు తాపడం చేసిన చిన్న బంగారు కత్తి. పిడిపై పచ్చలు తాపడం చేసిన మరో కత్తి.
* పిడి కత్తులకు మణులతో తాపడం చేసిన ఒరలు.
* మణులు తాపడం చేసిన పతకము.
* వైడూర్యాలు పచ్చడం తాపడం చేసిన మొత్తం ఐదు భుజకీర్తులు.
* రాగి ఆకుల పరిమాణంలో బిళ్లలు కలిగిన రెండు బంగారు తాళ్లు మణులతో తయారు చేసినది.
* ఉత్సవ విగ్రహాలకు 3 బంగారు కిరీటాలు వజ్రాలు, వైడూర్యాలు, గోమేధికాలు తాపడం చేశారు.
**06-07-1514
(ఉదయగిరి కోటను వశపరుచుకున్న తరువాత)
*30 వేల బంగారు వరహాలతో స్వామికి కనకాభిషేకము, మరో బంగారు గొలుసు సమర్పించారు.
* ఒక జత బంగారు కడియాలు, పతకముతో కూడిన కంఠమాల ఒక చక్ర పతకము.
**26-10-1515
*ఒక నవరత్న ప్రభావళి (మకర తోరణము) దీనిలో 10,994 ఎర్ర రాళ్లు, 754 పచ్చలు, 608 గోమేధికాలు, 40 వైడ్యూర్యాలు 45 దినుసురాళ్లు, 920 ప్రాచీన వజ్రాలు 3,933 ముత్యాలు,, 6 పగడాలతో, 30 గవ్వ శంఖాలతో కూడిన 28, 287 క్యారెట్ల మకర తోరణము సమర్పించారు.
**02-01-1517
*బంగారు కంఠమాల
*పతకము
* 31,500 బంగారు వరహాలు
**09-09-1518
* పీతాంబరాల సెట్టు నవరత్నాలతో పొదిగినది.
* కుల్లావు (తలగుడ్డ) ముత్యములు, గోమేధికాలున్నది.
* నవరత్న శోభితమై రెండు చామరములు మరో 10 వేల బంగారు వరహాలు
* ఒక పతకము మరో నవరత్న పతకము.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com