రావణుడు-వీడియో


రజనీకాంత్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. తలైవా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాలా’. పా రంజిత్‌ దర్శకుడు. ధనుష్‌ నిర్మాత. ఈ సినిమా తమిళ ట్రైలర్‌ను చిత్ర బృందం సోమవారం సాయంత్రం విడుదల చేసింది. రజనీ తనదైన స్టైల్‌, డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకున్నారు. ముంబయిలోని తమిళవాసుల కోసం పోరాడే నాయకుడిగా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించారు. ‘కాలా అంటే ఎవరు?’ అని ఓ చిన్నారి ప్రశ్నించగా.. ‘రావణ్’ అంటూ నానా పటేకర్‌ సమాధానం చెబుతూ కనిపించారు. ఈ ప్రచార చిత్రంలో రజనీ తన భార్యకు ‘ఐ లవ్‌ యూ’ చెప్పే తీరు.. ఆమె రియాక్షన్‌ చాలా సరదాగా అనిపిస్తుంది. ట్రైలర్‌ చివర్లో ‘ మన దేహమే ఒక ఆయుధం.. ఇది ప్రపంచానికి తెలియాలి.. ప్రజలారా కదలిరండి’ అంటూ తలైవా పిలుపునివ్వడం హైలైట్‌గా నిలిచింది. ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించిన ఈ సినిమా ట్రైలర్‌ యూట్యూబ్‌లో కొత్త రికార్డు సృష్టించేలా కనిపిస్తోంది. ఇది విడుదలైన 15 నిమిషాల్లోనే 1.3 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 18,000 మంది ట్రైలర్‌ నచ్చిందంటూ లైక్‌ చేశారు. ‘కాలా’లో రజనీ భార్య పాత్రలో ఈశ్వరీరావు నటించారు. బాలీవుడ్‌ నటి హుమా ఖురేషీ ప్రధాన పాత్ర పోషించారు. సంతోష్‌ నారాయణన్‌ బాణీలు అందించారు. జులై 7న ఈ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com