రాష్ట్రపతి కూడా తెలియదు

బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ భారత రాష్ట్రపతి పేరు చెప్పలేకపోయారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బాఘి 2’. దిశా పటానీ కథానాయిక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా టైగర్‌, దిశా ఓ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ఎవరు? అని యాంకర్‌ ప్రశ్నించారు. దీనికి టైగర్ ‘ఇది కష్టమైన ప్రశ్న… ముఖర్జీ’ అన్నారు. ఆయన తప్పుగా సమాధానం చెప్పడంతో అదే ప్రశ్న దిశాను అడిగారు. ఆమె ‘రామ్‌ నాథ్‌ కోవింద్‌’ అని బదులిచ్చారు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com