రాష్ట్రానికి ఒకటి ఇలాంటిది పెట్టించంది ప్లీజ్

ఆడపిల్ల పుడితేనే అనవసరపు ఖర్చులు అనుకునేవారు దేశంలో ఇంకా చాలమందే ఉన్నారు. ఆడపిల్ల అని తెలిస్తే వదిలేయడం.. లేదంటే భ్రూణహత్యలకు పాల్పడటం లాంటి సంఘటనలు మారుమూల గ్రామాల్లో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులున్న ఓ ప్రాంతంలో ఆడపిల్లలను రక్షించడానికి ముందుకొచ్చాడో వైద్యుడు. బేటీ బచావో కార్యక్రమంలో తనవంతు ప్రయత్నంగా అమ్మాయి పుడితే వైద్యం ఖర్చులు తీసుకోవట్లేదు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన డా. గణేశ్‌ రాఖ్‌ హదప్సర్‌ ప్రాంతంలో మెడికేర్‌ హాస్పిటల్‌ ఫౌండేషన్‌ ట్రస్టు నడుపుతున్నారు. 25 పడకలతో ఉండే ఈ ఆసుపత్రిలో ఆడపిల్ల పుడితే ఆ తల్లిదండ్రుల నుంచి రూపాయి కూడా ఆశించకుండా వైద్యం అంతా ఉచితంగా అందిస్తున్నారు.ఇలా ఇప్పటివరకు ఈ ఆసుపత్రిలో 430మంది ఆడపిల్లలు జన్మించారు. అంతేగాక, పుట్టిన అమ్మాయి పేరు మీద ఆసుపత్రిలోని అందరికీ యాజమాన్యమే మిఠాయిలు అందించి వేడుకలు జరుపుతారట. తాను చేసే ఈ చిన్న సాయం కొంతమంది ఆడపిల్లలైనా బతికిస్తుందంటున్నారు గణేశ్‌.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com