రీమేక్ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగు ‘క్వీన్‌’ చిత్రంలో నటిస్తోంది. హిందీలో వచ్చిన ‘క్వీన్‌’కు ఇది రీమేక్‌. ఈ సినిమానే కాకుండా తమన్నా మరో బాలీవుడ్‌ రీమేక్‌లో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. తమిళంలో 2014లో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం ‘జిగర్‌థండా’ను హిందీలో రీమేక్‌ చేయనున్నారు. ఈ సినిమాకి బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు. నిశికాంత్‌ కామత్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా తమన్నాను ఎంపిక చేసినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com