రూపాయి కోసం పిడిగుద్దులు గుద్దుకుని చనిపోయారు

చిన్న చిన్న గొడవలకే క్షణికావేశానికిలోనై నేరాలకు పాల్పడుతున్నారు కొందరు. మరికొందరైతే ప్రాణాలు తీసుకోడానికి, అవసరమైతే ఎదుటివారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడట్లేదు. మహారాష్ట్రలోని థానేలో ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. రూపాయి కోసం జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. అసలేం జరిగిందంటే..థానేలోని కల్యాణ్‌కు చెందిన మనోహర్‌ గమ్నే(54) శుక్రవారం రాత్రి గుడ్లు కొనేందుకు పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లాడు. అయితే గమ్నే గుడ్ల ధర కంటే రూపాయి తక్కువ చెల్లించాడు. దీంతో ఆ దుకాణాదారుడు గమ్నేతో గొడవకు దిగాడు. అతడిని తీవ్రంగా దూషించాడు. అనంతరం ఇంటికి వెళ్లిన గమ్నే జరిగిన విషయం కుటుంబసభ్యులకు చెప్పాడు. కొద్ది సేపటి తర్వాత గమ్నే, అతడి కొడుకు మళ్లీ ఆ దుకాణానికి వెళ్లారు. తన తండ్రిని ఎందుకు తిట్టారో చెప్పాలంటూ గమ్నే కుమారుడు దుకాణదారుడితో గొడవ పెట్టుకున్నాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన దుకాణాదారుడి కుమారుడు గమ్నేపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com