రూ.355కోట్లు ఖర్చయింది

భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ ప్రయాణ ఖర్చులను పీఎంవో విడుదల చేసింది. ప్రధాని విదేశీ ఖర్చుల వివరాలు తెలపాల్సిందిగా సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన దరఖాస్తుకు పీఎంఓ సమాధానం ఇచ్చింది. దీని ప్రకారం..భారత ప్రధానిగా 2014లో మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మోదీ 41సార్లు విదేశాలకు ప్రయాణించారు. ఇందులో భాగంగా 52 దేశాల్లో పర్యటించారు. 48నెలల కాలంలో 165రోజులు విదేశాల్లోనే బస చేశారు. ఇందుకు గానూ రూ.355కోట్లు ఖర్చయింది. బెంగుళూరుకు చెందిన భీమప్ప గదాద్‌ ప్రధాని విదేశీ ఖర్చుల వివరాలు తెలుసుకునేందుకు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. దీనికి గానూ ప్రధాన మంత్రి కార్యాలయం సమాధానం ఇచ్చింది. 2015లో తొమ్మిది రోజుల పర్యటనలో భాగంగా మోదీ.. ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడాల్లో పర్యటించారు. ఇందుకు గానూ రూ.31,25,78,000 ఖర్చయింది. అంతేకాకుండా 41 పర్యటనలోకెల్లా ఈ ప్రయాణానికే అత్యధికంగా ఖర్చు చేశారు. ఒకరోజు పర్యటనలో భాగంగా 2014లో భూటాన్‌కు వెళ్లినప్పుడు అత్యల్పంగా రూ.2,45,27,465 ఖర్చయింది. దీనిపై దరఖాస్తుదారు భీమప్ప మాట్లాడుతూ..‘ ఈవివరాలు నా ఆసక్తి మేరకు తెలుసుకున్నాను.ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. ప్రధాని విదేశీ పర్యటనకే ఎక్కువ నిధులు ఖర్చవుతున్నాయని కొందరు అంటుంటే విన్నాను. అందుకే ఖర్చుల వివరాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే దరఖాస్తు చేసుకున్నాను. అయినా సెక్యూరిటీ గురించి నా దరఖాస్తులో పేర్కోలేదు. నేను కేవలం ఖర్చుల వివరాలు మాత్రమే అడిగాను.’ అని తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com