రూ.500కోట్లు మాత్రమే తిరిగి ఇవ్వగలం

ఎరిక్సన్‌ కంపెనీకి రూ.500కోట్లు ఇవ్వగలమని టెలికాం సంస్థ ఆర్‌కామ్‌ మంగళవారం వెల్లడించింది. అనిల్‌ అంబానీ సంస్థ ఆర్‌కామ్‌ నుంచి రూ.1600కోట్లు వసూలు చేసుకునేందుకు స్వీడన్‌కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్‌ వేసిన దివాలా పిటిషన్‌ను నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ) అనుమతించింది. ఎస్‌సీఎల్‌ఏటీ బెంచ్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎస్‌.జే.ముఖోపాధ్యాయ్‌ దీన్ని విచారించారు. సమస్య పరిష్కారం కోసం ఇరు సంస్థలు చర్చించుకోవాల్సిందిగా సూచించింది. అవసరమైతే దీన్ని పరిష్కరించుకునేందుకు కొంత సమయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని బెంచ్‌ వెల్లడించింది. ఎరిక్సన్‌కు ఆర్‌కామ్‌ రూ.1600కోట్లు బకాయి పడింది. అయితే.. అందులో రూ.500కోట్లు చెల్లించేందుకు ఆర్‌కామ్‌ సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ తెలిపారు. ఆర్‌కామ్‌కు ఇప్పటికే రూ.46వేల కోట్ల మేర అప్పులు ఉన్నాయని సిబాల్‌ ఈ సందర్భంగా న్యాయస్థానం ఎదుట ప్రస్తావించారు. ఆర్‌కామ్‌ ఆస్తులు కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ జియో ముందుకు వచ్చిందని, స్పెక్ట్రం బకాయిలు చెల్లించేందుకు రూ.17వేల కోట్లు ఇస్తామని జియో ఆఫర్‌ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఆర్‌కామ్‌ దేశవ్యాప్త నెట్‌వర్క్‌ నిర్వహణ కోసం 2014లో ఎరిక్సన్‌ ఏడళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకైన వ్యయాలు రూ.1,150కోట్లు వసూళ్ల కోసం ఆర్‌కామ్‌, దాని అనుబంధ సంస్థలు రిలయన్స్‌ టెలికాం, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌లపై ఎరిక్సన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్లను ఎన్‌సీఎల్‌ఏటీ విచారిస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com