రెండోది సోమవారం నాడు

కమలహాసన్‌​ విశ్వరూపం సినిమా ఎంతటి వివాదాలను సృష్టించిందో అందరికి తెలిసిందే. చివరకు సినిమా విడుదల విషయంలో విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతోంది. ఎప్పుడో రావల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. కమల్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వరూపం 2 సినిమా జూన్‌ 11 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా సోమవారం సాయంత్రం 5 గంటలకు మూడు భాషల్లో ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కానుంది. హిందీ వెర్షన్‌ను ఆమిర్‌ ఖాన్‌, తమిళ వెర్షన్‌ను శృతి హాసన్‌, తెలుగు వెర్షన్‌ను యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రియా, ఆండ్రియా కమలహాసన్‌కు జోడిగా నటించగా, జిబ్రాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com