రెండో రౌండ్ ఐటీ దాడుల్లో తమిళనాడు

తమిళనాడులో మరోసారి ఐటీదాడులు కలకలం రేపాయి. పన్ను ఎగవేత వ్యవహారంలో మంగళవారం మరో 33 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. చెన్నైలోని 21 ప్రాంతాలు, చెన్నై వెలుపల మరో 12 చోట్ల ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. స్పెక్ట్రమ్‌ మాల్‌, పటేల్‌ గ్రూప్‌, మార్గ్‌ గ్రూప్‌, మిలాన్‌ గ్రూప్‌, గంగా ఫౌండేషన్‌ గ్రూప్‌కు చెందిన ఆఫీసులు, నివాస స్థలాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. కాగా.. ఇటీవల అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ బంధువుల ఇళ్లు, జయ టీవీ కార్యాలయంలో ఐటీ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో రూ.1,430 కోట్ల లెక్కకు రాని సందపను గుర్తించారు. కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనికి కొనసాగింపుగానే తాజా దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com