రెండో విశ్వరూపం

విలక్షణ నటుడు కమల్‌ హాసన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఆయన‌ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వరూపం 2’. ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ సోమవారం విడుదలైంది. ‘‘ట్రైలర్‌లో కమల్‌హాసన్‌ సర్ ‘విశ్వరూపం’ చూశాను. ‌ఒక మనిషి. ఎన్నో ముఖాలు. ఓ గొప్ప నటుడు నటించిన సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నాను’’ అంటూ పేర్కొంటూ తెలుగు ట్రైలర్‌ను ఎన్టీఆర్‌ విడుదల చేయగా, తమిళంలో కమల్‌ కుమార్తె శ్రుతి హాసన్‌, హిందీలో ఆమిర్‌ఖాన్‌లు విడుదల చేశారు. ‘నాజర్‌ను బడికి పంపాలి. జలాల్‌ను కాలేజ్‌కి పంపాలి’ అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ ఆసక్తికరంగా మొదలైంది. ‘ఏ మతానికో కట్టుబడటం తప్పు కాదు బ్రదర్‌! కానీ, దేశ ద్రోహం తప్పు.’ అని కమల్‌ చెబుతున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. తొలి భాగానికి మించి ఇందులో యాక్షన్‌ సన్నివేశాలను తీర్చిదిద్దారు. అదే స్థాయిలో రొమాంటిక్‌ సన్నివేశాలూ ఉన్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఇందులో కమల్‌హాసన్‌కు జోడీగా పూజాకుమార్‌, ఆండ్రియా జెరీమియా నటిస్తున్నారు. రాహుల్‌ బోస్‌, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్‌ కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘విశ్వరూపం’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. ఈ సినిమా విడుదల సమయంలోనే రాజకీయ నేపథ్యంలో వివాదాస్పదంగా తెరకెక్కించారని, సినిమాను నిషేధించాలని పలువురు డిమాండ్‌ చేశారు. ఇప్పుడు రజనీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ‘విశ్వరూపం 2’ రాబోతుండడంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com