రేపటి నుండి బ్యాంకుల సమ్మె

దేశంలోని 10లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు తమ వేతన పెంపుపై నిరసనగా బుధవారం నుంచి సమ్మె నిర్వహించనున్నారు. వేతన పెంపుపై చర్చించేందుకు ఇప్పటికే అడిషనల్‌ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ (సీఎల్‌సీ)రాజన్‌ వర్మ యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌, ఆర్థిక శాఖ అధికారులు, బ్యాంకుల యాజమాన్యాలు భేటీ అయ్యారు. కానీ, చర్చలు ఫలించలేదు. దీంతో సమ్మె జరుగుతుందని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ సి.హెచ్‌. వెంకటాచలం తెలిపారు. ‘సమ్మెకు సంబంధించిన అంశాల పరిష్కారం కోసం సీఎల్‌సీ వీలైనంత కృషి చేశారు. కానీ, ఎటువంటి ఫలితం లేదు. బ్యాంకు ఉద్యోగుల వేతన పెంపు ప్రతిపాదనలను మరోసారి పరిశీలించేందుకు సానుకూలంగా ఉన్నాం. కానీ, అటువైపు కచ్చితమైన ప్రతిపాదనులు ఏమీ రాలేదు’ అని ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ ప్రతినిధి తెలిపారు. ‘‘మే 30, 31వ తేదీల్లో జరిగే సమ్మెలో దాదాపు 10లక్షల మంది ఉద్యోగులు పాల్గొంటారని అంచనా. ప్రతిపాదించిన 2 శాతం వేతన పెంపు ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.’’ అని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్స్‌ జనరల్‌ సెక్రటరీ డి.టి.ప్రాంకో తెలిపారు.
మరోపక్క పెరిగిన ఎన్‌పీఏలతో ఇబ్బందులు పడుతున్న బ్యాంకులు 2శాతానికి మించి వేతనాలను పెంచే స్థితిలో లేవు. మరో విడత కూడా చర్చలకు బ్యాంకు యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఎన్‌పీఏలతో బ్యాంకు ఉద్యోగుల జీతాలకు ముడిపెట్టడం ఏమాత్రం భావ్యంకాదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com