రేపు “పద్మభూషణ్” అందుకోనున్న “పద్మశ్రీ” యార్లగడ్డ

మాజీ రాజ్యసభ సభ్యులు, కేంద్రీయ హిందీ సంస్ధాన్ అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త, రచయిత, జాతీయ స్ధాయి ప్రముఖులు, అజాతశతృవు, పద్మశ్రీ, ఇరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రేపు ఉదయం రాష్ట్రపతి భవనంలో జరిగే పద్మ పురస్కారాల కార్యక్రమంలో హిందీ, తెలుగు భాషలకు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో అందించిన సేవలకు గానూ పద్మభూషణ్ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారత జాతీయ దూరవాణి సంస్ధ దూరదర్శన్ లో ఉదయం 11:25 నిముషాల(భారత కాలమానం) నుండి ఈ లంకెలో వీక్షించవచ్చు – https://www.youtube.com/user/DoordarshanNational. డాక్టర్ యార్లగడ్డ భాషాసేవ ద్వారా మరిన్ని పురస్కారాలు అందుకోవాలని TNI అభిలషిస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com