రేపు శుభ శుక్రవారం

* క్రీస్తు తాను మానవాళి పాపాలను శిలువగా మోశారు… తన రక్తాన్ని చిందించి సమస్త ప్రపంచాన్నీ ప్రక్షాళన చేశారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఆయనను శిలువపై వేలాడదీశారు. ఎంతో బాధ అనుభవించిన ఆయన ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన ఆత్మను సమర్పించారు. మానవాళిని వారి పాపాల నుంచి క్రీస్తు విముక్తి చేసిన రోజు కాబట్టి ఆ రోజును విమోచన దినంగా, శుభ శుక్రవారంగా క్రైస్తవ సోదరులు పాటిస్తారు.
* ఆ రోజు ఆయన శిలువపై చెప్పిన మాటలను స్మరిస్తూ ప్రార్థనలో గడుపుతారు. కొందరు ఉపవాసం ఉంటారు.
* క్రీస్తు శుక్రవారం రోజు పరమపదించారు. మూడో రోజయిన ఆదివారం ఆయన తిరిగి లేచి సశరీరంగా శిష్యులతో పాటు అనేక మందికి కనిపించారు. ఆయన పునరుద్ధానాన్ని ఈస్టర్‌ పండగగా పిలుస్తారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com