రేపే కమల్ పార్టీకి శ్రీకారం. విందుకు కేజ్రీవాల్.

ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ రేపు మధురైలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇస్తున్న విందుకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని కమల్‌ హాసన్‌ సన్నిహితులు నేడు వెల్లడించారు. కేజ్రీవాల్‌ మధురైలో సాయంత్రం జరిగే బహిరంగ సమావేశానికి కూడా హాజరవుతారని తెలిపారు. గతంలో కేజ్రీవాల్‌.. కమల్‌హాసన్‌ను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. గత ఏడాది సెప్టెంబరులో కేజ్రీవాల్‌ కమల్‌హాసన్‌ను కలిసి మాట్లాడారు. అప్పట్లో కమల్‌ రాజకీయాల్లోకి రానున్నారని వార్తలు రావడంతో కేజ్రీవాల్‌ ఈ విషయంపై కమల్‌తో చర్చించారు. దేశంలో అవినీతి, మతతత్వం బాగా పెరిగిపోయిందని, ఒకే విధంగా ఆలోచించే నాయకులు చర్చించుకొని వాటిని అరికట్టేందుకు కలిసి పనిచేయాలని అప్పుడు కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. ఇప్పుడు కమల్‌ పార్టీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్‌ను ఆహ్వానించడం గమనార్హం. తనకు అధికార అన్నాడీఎంకే నేతలతో మాట్లాడే ఉద్దేశం లేదని కమల్‌ స్పష్టంచేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com