రేపే ప్రమాణస్వీకారం

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్‌ వజూభాయి వాలా ప్రమాణస్వీకారం చేయిస్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీల నాయకులు హాజరు కానున్నారు. కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా హెచ్‌.డి.కుమారస్వామి విధానసౌధ తూర్పు ద్వారం మెట్లపై బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వేదిక నిర్మాణ పనులు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కొత్తగా నిర్మించిన వేదికపై అర్చకులు శాంతి పూజలు చేశారు. స్వగ్రామం హరదనహళ్లి, పెరిగిన హొళెనరసీపుర పర్యటన అనంతరం కుమార బెంగళూరు చేరుకుని ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై ఆరాతీశారు. అనంతరం దిల్లీకి బయలుదేరి వెళ్లారు. పాదరక్షలు లేకుండా ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ‘‘ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న ఆనందం కన్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలను వేగంగా నెరవేర్చాలన్న ఆత్రుతే నాలో ఉంది. పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఉంటే బాగుండేదనిపిస్తోంది. డి.కె.శివకుమార్‌తో వ్యక్తిగత వైరం ఏమీ లేదు. ఈ ఎన్నికల్లో ఇద్దరం మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ట్రోఫీని దక్కించుకున్నాం. గత సంకీర్ణ ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ తలెత్తకుండా చూసుకునేందుకు ప్రాధాన్యమిస్తాను’’ అని దిల్లీకి బయలుదేరి వెళ్లే ముందు కుమారస్వామి విలేకరుల వద్ద పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com