రైతుదేవుడు కేసీఆర్

కేసీఆర్‌ను మించిన రైతు బాంధవుడు దేశంలో ఎవరూ లేరని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో రూ.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు సహచర మంత్రులు ఈటల రాజేందర్‌, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కర్ణాటకలో కూడా అమలు చేస్తామని అక్కడి నేతలు చెబుతున్నారని గుర్తు చేశారు. రైతులకు 24 గంటల విద్యుత్‌, పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.8వేలు అందిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీ బాల్కాసుమాన్‌, వివేక్‌, సోమారపు సత్యనారాయణ, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com