రైతులు నాశనం అవుతారు

‘కావేరీ నదీ జలాల వివాదంపై సుప్రీం ఇచ్చిన తీర్పు నిరాశపరిచింది. దీని ప్రభావం రైతుల జీవనోపాధిపై దెబ్బకొడుతోంది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ తీర్పును పునఃపరిశీలించాల్సిందిగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలి’ అని రజనీకాంత్‌ పేర్కొన్నారు. అంతకముందు కమల్‌హాసన్‌ కూడా ఇదే రీతిలో తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. ‘కావేరీ విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పు విని నేను షాకయ్యాను. ఈ తీర్పు విషయంలో పూర్తి వివరాల కోసం ఎదురుచూస్తున్నాను. అయితే నీరు ఏ రాష్ట్రం సొంతం కాదని సుప్రీం గట్టిగా చెప్పింది. ఇది బాధాకర విషయం’ అని కమల్‌ అన్నారు. అగ్ర నటులైన వీరిద్దరూ తమిళ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com