రైతుల కోసం పంజాబ్ ప్రభుత్వ యాప్

రైతుల కోసం పంజాబ్‌ ప్రభుత్వం నూతన సాంకేతికతతో సరికొత్త మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ ‘కిసాన్‌ సువిధ’ పేరిట ఈ యాప్‌ను మంగళవారం ఆవిష్కరించారు. రైతులకు ఉపయోగపడే వాతావరణ సమాచారం, పంటల గిట్టుబాటు ధరలు, నిపుణుల సలహాలు, పంటల సంరక్షణ, ఇన్‌పుట్‌ డీలర్లు తదితర అంశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ యాప్‌ ద్వారా రైతులు తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా కిసాన్‌ కాల్‌సెంటర్‌కు రైతులు నేరుగా అనుసంధానమై తమ సమస్యలకు పరిష్కారాలను పొందవచ్చు. దీన్ని వినియోగించుకోవాలంటే రైతులు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని తమ మొబైల్‌ నంబర్‌ను రిజిస్టర్‌ చేసుకోవాలి. అనంతరం హిందీ, ఇంగ్లిష్‌, పంజాబీ భాషల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. తాము వ్యవసాయం చేసే ప్రాంతం(జిల్లా, మండలం, గ్రామం)వివరాలను నమోదు చేయాలి. వాతావరణానికి సంబంధించిన బటన్‌ నొక్కగానే ఆరోజుకు సంబంధించిన వివరాలతో పాటు వచ్చే ఐదు రోజుల వాతావరణ వివరాలను తెలియజేస్తుంది. అకాల వర్షాలు, వడగండ్ల వాన, భారీ వర్షాలకు సంబంధించి ఇది ముందే రైతులను హెచ్చరిస్తుంది. మార్కెట్‌ ప్రైస్‌ బటన్‌ నొక్కగానే పంటలకు సంబంధించి తాజా మార్కెట్‌ ధరలను వెల్లడిస్తుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com