రోజా పువ్వులే ఎందుకు?

అది ప్రేమికుల దినోత్సవం కావచ్చు. మరే ఇతర రోజైనా కావచ్చు. ప్రేమికులు ఇచ్చి పుచ్చుకునే రోజా పూలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ వివరాలు ఇలా..
**అంకెల్లో ఇలా
* ఒక పువ్వు ఇస్తే.. తొలి చూపులో ప్రేమ కలిగినట్లు
* రెండిస్తే.. నీతో గాఢమైన ప్రేమలో ఉన్నట్లు
* మూడు ..నేను నిన్ను ప్రేమిస్తున్నా
* నాలుగు .. మన మధ్య ఏమీ లేదు
* ఐదు.. నీ బాగోగులకు ప్రాధాన్యమిస్తా
* ఆరు.. నేను నీ కోసమే
* పదకొండు..నీకంటే విలువైంది ఈ లోకంలో మరొకటి లేదు
* 21 .. జీవితాంతం నిను విడవను
* 24.. నా మనసులో చెరగని ముద్ర నీదే
* 40.. నాది నిజమైన ప్రేమ
* 99.. తుది శ్వాస విడిచేదాక నిన్నే ప్రేమిస్తుంటా
* 108.. నన్ను పెళ్లి చేసుకుంటావా?
***రంగుల్లో ఇలా..
* ఎరుపు : నిష్కల్మషమైన ప్రేమకు చిహ్నం.
* తెలుపు : శాంతికి చిహ్నం. ఎక్కువగా పెళ్లిళ్లలో వాడతారు.
* గులాబీ : ఎదుటి వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు.
* పసుపు : స్నేహానికి, ప్రాణమిచ్చేంత ప్రేమకు, దయా గుణానికి నిదర్శనం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com