రోజులో కాసేపు పరుగెత్తండి

* మనం ఎంత వేగంతో పరుగు పెడుతున్నామనే దానిపైనే కరిగే కెలొరీల సంఖ్య ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇరవై నిమిషాల నుంచి అరగంట వరకూ పరుగెత్తేలా చూసుకోవాలి.
* వాలూ, ఎత్తున్న ప్రాంతాలు ఎక్కుతూ పరుగెత్తడం వల్ల కాలి పిక్కల కండరాలు దృఢంగా మారతాయి. తొడలూ, పిరుదుల వద్ద పేరుకున్న కొవ్వూ కరుగుతుంది.
* పరుగును వ్యాయామంగా ఎంచుకోవాలనుకున్నవారు నేరుగా పరుగెత్తకూడదు. మొదట కాసేపు వార్మ్‌ అప్‌ చేయాలి. ఆ తరువాత మెల్లగా వేగం పెంచుకుంటూ పరుగెత్తాలి. ఇలా చేయడం వల్ల గుండె, ఊపిరితిత్తులూ, కండరాల మధ్య సమన్వయం కుదిరి శరీరం చురుగ్గా పనిచేస్తుంది.
* పరుగు పూర్తిచేసే క్రమంలో కూడా క్రమక్రమంగా తగ్గించుకుంటూ వెళ్లాలి. వేగాన్ని తగ్గించుకుంటూ రావాలి. అప్పుడే ఉచ్ఛ్వాసనిశ్వాసాలు మీ నియంత్రణలో ఉంటాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com