రోల్స్ రాయిస్‌…ఎస్‌యూవీ విశేషాలు

విలాసవంతమైన కార్లకు చిరునామా రోల్స్ రాయిస్‌. కలినాన్‌ పేరుతో తొలిసారి స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనం తయారు చేసింది. విశేషాలు చాలానే ఉన్నాయ్‌ అంటున్నారు. ఏంటవి?
* ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం కలినాన్‌. 1905లో దక్షిణాఫ్రికాలోని కలినాన్‌ ప్రాంతంలో కనుగొన్నారు. దీన్ని ఏడవ కింగ్‌ ఎడ్వర్డ్‌ బహుమానంగా పొందాడు. ప్రస్తుతం బ్రిటీష్‌ రాణి కిరీటంలో ఒదిగి ఉంటుంది. ఆ పేరునే ఈ సరికొత్త ఎస్‌యూవీకి పెట్టారు.
* సాధారణంగా ఏ కారుకైనా వెనక డోర్లు ముందుకు తెరుచుకుంటాయి. కానీ దీనికి భిన్నంగా కలినాన్‌కి ముందు నుంచి వెనకకు తెరుచుకుంటాయి. వీటిని ‘సూసైడ్‌ డోర్లు’ అంటారు. ప్రపంచంలో ఈ తరహా డోర్లు ఉన్న ఎస్‌యూవీ ఇదొక్కటే.
* ప్రస్తుతం అత్యంత విలాసవంతమైన ఎస్‌యూవీ ఇదే. నాణ్యమైన లెదర్‌, మేటి కలపతో అంతర్గత భాగాల్ని తీర్చిదిద్దారు. లోపల విశాలమైన స్థలం ఉంటుంది. సోఫాలో కూర్చున్న అనుభూతి కలుగుతుందట.
* సౌకర్యాల్లో దీన్ని మించింది లేదంటున్నారు. బూట్‌ స్పేస్‌ దాదాపు ఆరువందల మిల్లీమీటర్లు. వెనకవరుస సీట్లను సమాంతరంగా మడిస్తే ఆ స్థలాన్ని కూడా వాడుకోవచ్చు.
* ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు రోల్స్ రాయిస్‌ ఏ కారులోనూ తాకే తెర పరిజ్ఞానం లేదు. కలినాన్‌తో ఆ కొరత తీరబోతోంది. అంతేకాదు.. చీకట్లలో కూడా జంతువుల్ని గుర్తించే నైట్‌ విజన్‌, యాక్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, వైఫై హాట్‌స్పాట్‌, స్మార్ట్‌ఫోన్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ స్పాట్‌.. ఎంతో అత్యాధునిక టెక్నాలజీ దీని సొంతం.
* మీట నొక్కితే తెరుచుకునే డోర్లు, లోపల ఎవరైనా కూర్చోబోతుంటే రెండు అంగుళాలు కిందికి తగ్గే సీట్లు.. వాటంతటవే శుభ్రం చేసుకునే సీట్లు.. మరిన్ని హంగులు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com