లండన్‌లో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహిస్తున్న 5వ ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సును లండన్‌లో నిర్వహించారు. పవిత్రరెడ్డి కంది సమన్వయకర్తగా నిర్వహించిన ఈ సదస్సుకి మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ముఖ్యఅతిథిగా హాజరై మహాసభల ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా గుర్తించే విధంగా తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా తెలంగాణ సాహితీ వైభవాన్ని చాటేలా సభలు నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. అమెరికా,కెనడా, ఆస్ట్రేలియా,న్యూజిలాండ్, యూరప్, గల్ప్ దేశాలతో పాటు మారిషన్, సింగపూర్, మలేసియా లాంటి దేశాల్లోని ప్రవాసులు కూడా ఈ వేడుకలకు తరలివస్తున్నారని పేర్కొన్నారు. ఈ మహాసభల్లో అవధానాలు, కవి సమ్మేళనాలు, సాహిత్య ప్రక్రియలపై సభలు ఉంటాయని వివరించారు. ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం, నిజాం కాలేజీ గ్రౌండ్స్, భారతీయ విద్యాభవన్, పింగిలి వెంకట్రాంరెడ్డి హాల్, శిల్ప కళావేదిక తదితర వేదికల్లో కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. అనంతరం ప్రవాసులు మహేష్‌ను శాలువాతో సత్కరించారు. ఈ సదస్సుకు యూకే లో వున్న ప్రవాస సంఘాల (టాక్, జాగృతి యుకె – యూరోప్, టి.డి.ఎఫ్ యుకె, టి.ఎన్.ఎఫ్, తాల్, యుక్తా, జేటీఆర్డీసీ, ఎన్నారై టీ.ఆర్.యస్ యూకే) ప్రతినిధులు, తెలుగు రచయితలు, కళాకారులు పాల్గొన్నారు.
tnilive.com tnilive

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com