లావణ్య కోపం

నటి లావణ్య త్రిపాఠికి కోపం వచ్చింది. బ్రహ్మన్‌ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు నాయకిగా పరిచయమైన ఈ అమ్మడిని ఇక్కడ పెద్దగా పట్టించుకోలేదు. అయితే టాలీవుడ్‌ మాత్రం మంచి పొజిషన్‌నే లావణ్యకు అందించింది. తాజాగా మయావన్‌ చిత్రంలో నటించిన ఈ జాణ ఆ చిత్ర విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ లోపే ఆరోపణల్లో ఇరుక్కుంది. ఈ అమ్మడు తెలుగులో మంచి విజయాన్ని సాధించిన 100% లవ్‌ చిత్ర తమిళ్‌ రీమేక్‌లో నటించడానికి అంగీకరించి ఆ తరువాత వైదొలిగింది. దీంతో ఆ చిత్ర నిర్మాత లావణ్యపై రూ.3 కోట్లు నష్టం చెల్లించాలంటూ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసినట్లు సోషల్‌ మీడియాల్లో ప్రచారం వైరల్‌ అవుతోంది.దీని గురించి చాలా ఆలస్యంగా రియాక్ట్‌ అయిన లావణ్యత్రిపాఠి తాను 100% కాదల్‌ చిత్రం నుంచి వైదొలగిన మాట వాస్తవమేనని అంగీకరించింది. అయితే ఆ చిత్రం విషయంలో నిర్మాతకు తనకు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని, అలాంటి పరిస్థితుల్లో ఆ చిత్రంలో నటించడం సాధ్యం కాదని వైదొలిగినట్లు వివరించింది. అందుకు ఆ చిత్ర నిర్మాత తాను నష్టపరిహారంగా రూ.3 కోట్లు చెల్లించాలని నిర్మాతలమండలిలో ఫిర్యాదు చేసినట్లు వదంతులు ప్రచారం చేస్తున్నారని అంది.అయినా ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయని, అందువల్ల ఈ విషయాన్ని ఇంకా చర్చనీయాంశం చేయడం మంచిది కాదని కాస్త గట్టిగానే చెప్పింది. ఈ విషయంలో తాను మౌనంగా ఉంటున్నానంటే ఏమైనా రాసుకోవచ్చునని అర్థం కాదని, ఆ వదంతి వల్ల తనకెలాంటి నష్టం లేదనే తాను మౌనం వహించానని లావణ్యత్రిపాఠి పేర్కొంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com