లాస్ ఏంజిల్స్‌లో తానా టెబుల్ టెన్నిస్ పోటీలు


దక్షిణ కాలిఫోర్నియాలో మొట్టమొదటిసారిగా టేబుల్టెన్నిస్ క్రీఢా పోటీలను తానా లాస్ ఏంజెల్స్ అద్వర్యంలో ఏప్రిల్ 21 న విజయవంతంగా నిర్వహించారు. ఈ పోటీల్లొ 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తానా అధ్యక్షుడు సతీష్ వేమన ముఖ్య అతిధిగా ఈ టేబుల్ టెన్నిస్ పోటీలను ప్రారంభించారు. లాస్ ఏంజెల్స్లో ని వివిధ తెలుగు సంఘాల వారు ఈ పోటీలలో పాల్గొన్నారు. చిన్నారుల విభాగంలో ఆశ్రయ్ ఆత్మకూరు విజేతగా విశ్రుత్ సాతులూరి రన్నరప్‌గా నిలిచారు. పురుషుల సింగిల్స్‌లో సుధాం, హర్ష ఆత్మకూరుపై ఫైనల్స్లో విజయం సాధించారు. హోరా హోరీగా జరిగిన మహిళా సింగిల్స్ విభాగంలో అంపైర్లు రత్న బొంతు మరియు పుష్ప పగిడ్యాలకు ప్రథమ స్థానాన్ని నిర్ణయించారు. రేఖ ద్వితీయస్థానంలో నిలిచారు. పురుషుల టీం విభాగంలో రాజారెడ్డి-హితేన్ ప్రధమస్థానంలో కృష్ణసామంతుల-ప్రవీణ్ కీర్తి ద్వితీయస్థానంలో నిలిచారు. ఈ సంవత్సరం అక్టోబర్లో నిర్వహించే బ్యాక్టుస్కూల్, బ్యాక్ప్యాక్ ప్రోగ్రాంకొరకు నిధులను సమకూర్చుకునేందుకు తానా లాస్ ఏంజెల్స్ ఈ ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో పాల్గొనడం ద్వారా ప్రతి ఒక్కరు రాబోయో విద్యా సంవత్సరములో కొంత మంది నిరుపేద విద్యార్థులకు కావాల్సిన బ్యాక్ ప్యాక్స్, పుస్తకములు, పెన్స్ మరియు పెన్సిల్స్ ఉచితముగా ఇవ్వడంలో భాగస్వాములు అయ్యారు. ఈ పోటీలను విజయ వంతంగా నిర్వహించేందుకు తానా లాస్ ఏంజెలెస్ సిటీ కో-ఆర్డినేటర్ సురేష్ కందేపు, కార్యకర్తలు చంద్రశేఖర్ పల్లెబోయిన, శ్రీకాంత్ మోపర్తి, వినోద్ బూరుగుపల్లి, శ్రీనివాస్ పోపూరి, రవీంద్ర జంగాల, హర్ష ఆత్మకూరు, శ్రీహరి కొమ్మలపాటి, అమర్ కేతిరెడ్డి, సతీష్ నండూరి, సెంథిల్ కుమార్, మురళి పోట్ల, రామ్ యార్లగడ్డ, శశాంక్ రెడ్డి, మీర్, సృజన్ యాపర్తిలు కీలక పాత్ర పోషించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com