లైంగిక దోపిడీ ఉంది

సినీ పరిశ్రమలో ఆర్థిక, లైంగిక దోపిడీ జరుగుతోందని పలు మహిళా సంఘాల నేతలు ఆరోపించారు. జూనియర్‌ ఆర్టిస్టుల నుంచి హీరోయిన్ల దాకా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. శ్రీరెడ్డి నిరసనతో ఒక్కోటిగా వెలుగుచూస్తున్నాయని బుధవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశంలో తెలిపారు. అంతకుముందు పీఓడబ్ల్యూ నేతలు జి.ఝాన్సీ, సంధ్య, భూమిక సంస్థ వ్యవస్థాపకురాలు కొండవీటి సత్యవతి, సామాజిక కార్యకర్తలు దేవి, విమల, ఎన్‌.జ్యోతి, బి.విజయ, కె.సజయ తదితరులతో కూడిన ప్రతినిధుల బృందం సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిశారు. చిత్ర పరిశ్రమలో మహిళలను రక్షించేందుకు ఓ కమిటీని వేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. శ్రీరెడ్డి నిరసన నేపథ్యంలో చాలామంది ఆర్టిస్టులను కలిసి వాస్తవాలపై సమాచారం సేకరించినట్లు తెలిపారు. శ్రీరెడ్డి నిరసనకు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) స్పందించిన తీరు అవమానకరంగా ఉందని దుయ్యబట్టారు. వెంటనే ‘మా’ ఆమెకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సినీనటి, ‘మా’ సభ్యురాలు అపూర్వ మాట్లాడుతూ శ్రీరెడ్డిపై ‘మా’ తీసుకున్న నిర్ణయం తమకెవరికీ తెలియదన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com