వడ్డీ రేట్లు తగ్గించిన స్టేట్ బ్యాంకు

ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రామాణిక రుణ రేటును 0.9శాతం తగ్గించింది. నిధుల వ్యయం ఆధారంగా నిర్ణయించే కొత్త వడ్డీరేట్లు(ఎంసీఎల్‌ఆర్‌) జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. దీని ప్రకారం ఏడాది కాలావధి రుణాలపై వడ్డీ రేటు 8శాతం అవుతుందని ఓ ప్రకటనలో వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు రూ.లక్షల కోట్లలో డిపాజిట్లు వచ్చి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మూడేళ్ల కాలావధి కలిగిన రుణాలపై వడ్డీ రేటును 9.05శాతం నుంచి 8.15శాతానికి తగ్గించింది. గతవారం స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌ 0.3శాతం, ఐడీబీఐ 0.6శాతం రుణ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com