గోడ దూకేస్తున్న దేవినేని

కాంగ్రెస్‌ పార్టీ కీలక నాయకుడు, విజయవాడకు చెందిన దేవినేని నెహ్రూ పార్టీ మారేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఆదివారం నిర్వహించిన కీలక సమావేశంలో అనుచరులంతా ఒకేమాటపై నిలబడి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించినట్టు తెలిసింది. సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి ఆయన అనుచరులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. 1983లో తెదేపాలో చేరినప్పుడు నెహ్రూ వెంట ఉన్న పాత నాయకులు, నెహ్రూకు కంచుకోటగా భావించే గత కంకిపాడు.. ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గం నుంచి సైతం నాయకులు రావడం విశేషం. ఈ సందర్భంగా నెహ్రూ 15 నిమిషాలు ప్రసంగించాక, అనంతరం నేతల అభిప్రాయాలు స్వీకరించారు. తాను కష్టకాలంలో ఉన్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆదుకుందని, గౌరవించిందని, అలాగే తానూ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని నెహ్రూ ఆవేదన వ్యక్తం చేసినట్టు నేతలు వెల్లడించారు. అయితే నమ్ముకున్న వాళ్ల కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని, తన కుమారుడు అవినాష్‌ రాజకీయ భవిష్యత్తు కూడా ముఖ్యమేనన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. దీనిపై మరింత లోతుగా అనుచరులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించాక నిర్ణయం బయటకు ప్రకటించాలని సమావేశంలో నిర్ణయించారు. సెప్టెంబర్‌ 9, 16 తేదీల్లో ఏదో ఒకటి నిర్ణయించి తెలుగుదేశంలో చేరే అవకాశం ఉందని నెహ్రూ వర్గీయులు వెల్లడిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com