వరంగల్ కలక్టరేట్ వయస్సు 132 ఏళ్లు

పూర్వపు వరంగల్‌ జిల్లాకు 161 ఏళ్ళ చారిత్రక నేపథ్యం ఉన్నది. పూర్వపు వరంగల్‌ కలెక్టరేట్‌కు 132 ఏళ్ళ చరిత్ర ఉన్నది. జిల్లాకు, ఈ జిల్లా పరిపాలనా కేంద్రమైన కలెక్టరేట్‌ శతాబ్దాల కాలంలో అనేక పరిణమాలకు లోనైంది. బుధవారం వరంగల్‌ కలెక్టరేట్‌ ఆవరణలో సమీకృత కలెక్టరేట్‌ భవనసముదాయానికి శంకుస్థాపన జరిగిన నేపథ్యంలో పూర్వాపరాలను తెలుసుకుందాం. పూర్వపు వరంగల్‌జిల్లా 1857లో ఏర్పాటైంది. అప్పటి నైజాం రాష్ట్రంలో 37 జిల్లాలు ఉండేవి. అందులో ఒకటి వరంగల్‌ జిల్లా. 1870లో మొదటిసారి జిల్లాల పునర్విభజన జరిగింది. ఈ క్రమంలో అప్పటి వరకు ఉన్న వరంగల్‌ జిల్లా కాస్త ఖమ్మం జిల్లాలో విలీనమైంది. ఫలితంగా వరంగల్‌ కనుమరుగైంది. 1885లో వరంగల్‌ తిరిగి ఆవిర్భవించింది. ఈ సారి ఖమ్మం జిల్లా కాస్త వరంగల్‌లో విలీనం అయిం ది. 1953 వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. 1953లో వరంగల్‌ జిల్లా మరోసారి విభజనకు గురైంది. కనుమరుగైన ఖమ్మం జిల్లా తిరిగి ఏర్పాటైంది. అప్పటి వరకు కరీంనగర్‌లో ఉన్న పరకాల, నల్గొండ జిల్లాలో ఉన్న జనగామ వరంగల్‌ జిల్లాలో వచ్చి చేరాయి. 1885లో వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలతో కూడి వరంగల్‌ సుభా ఏర్పాటైంది. 1935లో అప్పటి వరకు మెదక్‌ సుభా పరిధిలో ఉన్న నిజామాబాద్‌ను తీసుకువచ్చి వరంగల్‌ సుభాలో కలిపారు. 1871లో వరకు పరకాల వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలో మధ్య అటూ ఇటూ బదిలీ అవుతూ వచ్చింది. ఆ తర్వాత 1956 నుంచి 2016 వరకు పెద్దగా మార్పులు, చేర్పులేవి జరగలేదు. ప్రస్తుత వరంగల్‌ కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని 1886లో అప్పటి ఈస్ట్‌ ఇండియా కంపెనీ సీనియర్‌ అధికారి జార్జ్‌ పాల్మర్‌ ప్రారంభించారు. వరంగల్‌ జిల్లా తొలి కలెక్టర్‌గా పనిచేసిన ఘనత ఎంబీ రజ్వాడకు దక్కింది. వరంగల్‌ పూర్వ జిల్లాలో 2016 వరకు 37 మంది కలెక్టర్లుగా పని చేశారు. కొత్త భవన సముదాయం నిర్మాణంతో పాత భవనం కనుమరుగుకానున్నది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com