వర్మ సలహా

అలనాటి తార శ్రీదేవి అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పారు. ఫిబ్రవరిలో ఆమె హఠాన్మరణాన్నిఆయన తట్టుకోలేకపోయారు. ఓ గొప్ప వ్యక్తిని, నటిని కోల్పోయామని చాలా బాధపడ్డారు. అతిలోక సుందరి జీవితం గురించి తనకు తెలిసిన కొన్ని విషయాలను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. కాగా, వర్మ ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి ప్రస్తావించారు. ఆమె భర్త బోనీ కపూర్‌ అంటే తనకు ఏ మాత్రం ఇష్టం లేదని పేర్కొన్నారు. శ్రీదేవి సినీ కెరీర్‌ దెబ్బతినడానికి కారణం ఆయనేనని అభిప్రాయపడ్డారు. ‘నాకు బోనీ అంటే ఎప్పుడూ ఇష్టం లేదు. శ్రీదేవి కెరీర్‌ పతనానికి ఆయనే ముఖ్య కారణం. కానీ, ఆమెకు తన జీవితంలో బోనీ తప్ప మరొకరు లేరు. కేవలం ఈ కారణంతోనే బోనీపై ఫిర్యాదు చేయలేకపోయేవాడిని. శ్రీదేవికి సరైన విధంగా సలహాలు ఇవ్వలేకపోయేవాడిని’ అని వర్మ చెప్పారు. అంతేకాదు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ సినిమాల్లో సంతకం చేయొద్దని బోనీనే శ్రీదేవిని బలవంతం చేశారని ఆరోపించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com