వర్మ స్పూర్తితో సివిల్స్ కొట్టాడు

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వల్లే తాను సివిల్స్‌లో విజయం సాధించానని అంటున్నారు అక్షయ్‌కుమార్‌. సివిల్స్‌ పరీక్షల్లో 624వ ర్యాంక్‌ సాధించిన వరంగల్‌కు చెందిన అక్షయ్‌ ఓ ఆంగ్ల మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన జీవితంలో కీలక పాత్ర పోషించింది వర్మేనని అన్నారు. ‘నేను రామ్‌ గోపాల్‌ వర్మకు వీరాభిమానిని. వర్మకు సంబంధించిన ఏ ఒక్క వీడియోను మిస్సవ్వను. చెప్పాలంటే సివిల్స్‌ పరీక్షకు ఒక్క రోజు ముందు కూడా వర్మకు సంబంధించిన ఓ వీడియోను చూశాను. త్వరలో ఆయన్ని కలవాలనుకుంటున్నాను. కానీ నేను ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే ఆయన్ని కలుస్తాను. ఎందుకంటే ఆయన కంటే తక్కువ స్థాయిలో ఉంటే నన్ను పట్టించుకోరనే భయం. అదే జరిగితే నేను భరించలేను. లాజికల్‌గా ఎలా మాట్లాడాలన్నది వర్మ నుంచే నేర్చుకున్నాను. ప్రపంచంలోని అందరి తత్వవేత్తల గురించి వర్మ చదివారు. కాబట్టి నేను వారి గురించి చదవడం కంటే వర్మను చదవడం నయం అనిపించింది. దీని వల్ల నా పనులు సులువుగా చేసుకోగలుగుతున్నాను. వర్మ తెరకెక్కించిన ‘సత్య’ సినిమా చాలా సార్లు చూశాను. నేరాలకు సంబంధించిన సినిమాలు తీయడంలో వర్మది విభిన్న శైలి. నా గ్యాంగ్‌లో ఉన్న ఐదుగురు స్నేహితులను కూడా వర్మ అభిమానులుగా మార్చేశాను’ అని వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూను వీక్షించిన వర్మ తెగ సంబరపడిపోయారు. అక్షయ్‌కు తనపై ఉన్న అభిమానానికి ముగ్దుడైన వర్మ ట్విటర్‌ ద్వారా తనదైన శైలిలో అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలో సివిల్స్‌ పరీక్షల్లో రెండు సార్లు విఫలమయ్యాను. అలాంటి నేను ఓ టాపర్‌కు స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు నాకు గర్వంగా ఉంది. నేరస్థులకు, ఆకతాయికలకు మాత్రమే నేను స్ఫూర్తిదాయకం అని అనుకునేవారికి ఇది గుణపాఠం అవుతుంది. అక్షయ్‌..త్వరలో నిన్ను కలిసి చదువు గురించి చర్చించాలనుకుంటున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు వర్మ

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com