వలసలే అమెరికా బలం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అక్రమ వలసలపై అనుసరిస్తోన్న కఠిన వైఖరిని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల వ్యతిరేకించారు. ఇది చాలా క్రూరమైన, అసంబద్ధమైన చర్య అన్నారు. అమెరికా అగ్రదేశంగా ఎదగడానికి వలస విధానమే కారణమని ఆయన తెలిపారు. వలసల వల్ల అమెరికా అగ్రదేశంగా ఏలా ఎదిగిందో, తనలాంటి వాళ్లు ఎలా ఈ స్థాయిలో ఉన్నారో ఉదహరించారు. ‘ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం అనుసరిస్తోన్న కొత్తవిధానం చాలా క్రూరంగా ఉంది. దీనిలో మార్పును మైక్రోసాఫ్ట్ కోరుకుంటుంది. మనది వలస ప్రజల దేశం. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు ఇతర దేశాల్లోని నిపుణులను ఆకర్షించగల సత్తా అమెరికాకు ఉంది. ఇప్పడు మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలను అరికట్టడానికి అమెరికా అనుసరిస్తోన్న విధానాలు నన్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేయడం చాలా దారుణం. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం అమెరికా వలస విధానం ఘనతే. ఇక్కడ కాకుండా మరే దేశంలో నేను ఇంతటి పేరు పొందగలిగేవాడిని కాదు. ఈ వలసవిధానమే అమెరికాకున్న బలం. మానవహక్కులు, నైతికతను కాపాడేలా ఈ విధానాలు ఉండాలి. వాటికే మద్దతు తెలుపుతాను’ అని తన బ్లాగులో రాసుకొచ్చారు. ‘అయితే ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తోన్న ఈ విధానంతో మైక్రోసాఫ్ట్ కు ఏ సంబంధం లేదని చెప్పదలుచుకున్నాను ’ అని మైక్రోసాఫ్ట్ విధానమెంటో వెల్లడించారు. అక్రమ వలసలపై అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు అనుసరిస్తున్న కఠిన విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వలసదారుల నుంచి వారి సంతానాన్ని వేరుచేయడంపై అందరూ మండిపడుతున్నారు. మే5 నుంచి జూన్‌ 9 మధ్యకాలంలోనే 2,342 మంది పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com