వాణిజ్య కదనరంగంలో అమెరికా-చైనా పోరాటాలు

అమెరికాకు అత్యధికంగా అప్పులిచ్చిన చైనాతో ఆ దేశానికి వర్తక విభేదాలు తలెత్తితే ఏం జరుగుతుంది? ఇరు దేశాలకే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టం తప్పదు. ఇప్పుడు అటువంటి ప్రమాదమే కనిపిస్తోంది. అమెరికా ట్రెజరీ సెక్యూరిటీస్‌ను (రుణ బాండ్లు) భారీగా కొనుగోలు చేసిన చైనాతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వర్తక యుద్ధానికి తెరతీశారు. ఆర్థికంగా బలమైన రెండు పెద్ద దేశాల మధ్య ఇప్పుడు మొదలైన ఈ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఇలా మొదలైంది…!
* చైనాతో అధిక వర్తక లోటు వల్ల అమెరికా నష్టపోతోందని, దాన్ని తగ్గిస్తానని అధ్యక్షుడు ట్రంప్‌ తన ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.
* అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు చైనా వస్తువులపై భారీగా సుంకాలు విధించారు.

బాండ్లు విక్రయిస్తుందా?
* అమెరికాతో వర్తక యుద్ధం ముదిరిదే తన చేతిలో ఉన్న యూఎస్‌ ట్రెజరీ బాండ్లను చైనా గంపగుత్తగా విక్రయిస్తుందా? తద్వారా అమెరికాను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తుందా? అనేవి ఇప్పుడు వ్యక్తమవుతున్న సందేహాలు.
* అదే జరిగితే అమెరికా బాండ్ల మార్కెట్‌ ఒక్కసారిగా కుప్పకూలుతుంది.

కొత్తగా కొనుగోలు చేయకపోవచ్చు…
* ఈ ఏడాదిలో ఆర్థిక లోటును తట్టుకోవటానికి అమెరికా 1 ట్రిలియన్‌ డాలర్ల విలువైన బాండ్లను జారీ చేయాల్సి ఉంది.
* ఈ బాండ్లను చైనా కొనుగోలు చేయకపోవచ్చు. లేదా తక్కువ మొత్తంతో సరిపెట్టవచ్చు. ఏది జరిగినా అమెరికాకు ఇబ్బందే.

చైనా, జపాన్‌ వాటా అధికం
అమెరికా ట్రెజరీ బాండ్లలో మూడోవంతు చైనా, జపాన్‌ చేతుల్లో ఉన్నాయి. చైనా తర్వాత అత్యధికంగా జపాన్‌ వద్ద 1065.8 బిలియన్‌ డాలర్ల అమెరికా బాండ్లున్నాయి. మనదేశం కూడా 148.6 బిలియన్‌ డాలర్ల అమెరికా బాండ్లు కొనుగోలు చేసింది. అమెరికా బాండ్లకు ప్రపంచ మార్కెట్లో ఎంతో గిరాకీ ఉంటుంది.

ఫలితం…
* ట్రంప్‌ విధించిన సుంకాల ఫలితంగా చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే స్టీలు ఉత్పత్తులపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10% సుంకాల భారం పడుతోంది.
* కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, ఏరోస్పేస్‌, ఐటీ యంత్రసామగ్రిపై 25% పన్ను భారం పెరుగుతుంది.
* గత ఏడాదిలో చైనా నుంచి ఈ తరహా వస్తువులు కొనుగోలు చేయటానికి అమెరికా 160 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది.

చైనా స్పందన
* దీనికి అదేరీతిలో చైనా స్పందించింది.
* అమెరికా నుంచి చైనా కొనుగోలు చేసే వైన్‌, పండ్లు-ఫలాలు, పంది మాంసం, రీసైకిల్‌ చేసిన అల్యూమినియంపై పన్నుల భారాన్ని పెంచింది.
* అమెరికా సోయాబీన్‌కు చైనా అతిపెద్ద వినియోగదారుడిగా ఉంది. గత ఏడాదిలో అమెరికా సోయాబీన్‌లో 61 శాతాన్ని చైనా కొనుగోలు చేసింది.

అమెరికా పెత్తనానికి బీటలు..!
* స్వేచ్ఛా వాణిజ్యానికి మొదటి నుంచీ అమెరికా అనుకూలం. కానీ చైనా రక్షణాత్మక వాణిజ్య విధానాలను అనుసరించింది.
* ఇప్పుడు పరిస్థితి అటూఇటూ అయింది. అమెరికా రక్షణాత్మక విధానాల వైపు మొగ్గుతోంది. ఈ విధానాలను చైనా వ్యతిరేకిస్తోంది.
* ఈ మార్పుతో ప్రపంచ వాణిజ్యంపై ఆమెరికా ఆధిపత్యాన్ని కోల్పోయే పరిస్థితి రావచ్చని నిపుణుల విశ్లేషణ.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com