వాణిజ్య ప్రకటనలు దంచికొడుతున్నారు

గతేడాది జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ తర్వాత భారత మహిళా క్రికెటర్లకు ఆదరణ అమాంతం పెరిగింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వేద కృష్ణమూర్తి వంటి అమ్మాయిలు ఆస్ట్రేలియాలో బిగ్‌ బాష్‌ లీగులకు ఎంపికయ్యారు. చక్కని ఆటతీరుతో అదరగొట్టారు. ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన వారి ప్రదర్శనలు ఇప్పటికీ సగటు అభిమానికి గుర్తున్నాయి. అభిమానగణం పెరగడంతో వ్యాపారవేత్తలూ వీరిని బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియమించుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే మిథాలీ రాజ్‌ ఈ దిశగా ముందడుగు వేసింది. వన్డే ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచుల్లో అదరగొట్టిన ఎడమచేతి వాటం బ్యాటర్‌ స్మృతి మంధాన గుర్తుంది కదా! ఇప్పుడు దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ దుమ్మురేపుతోంది. ఆతిథ్య జట్టుతో జరిగిన రెండు మ్యాచుల్లో పరుగుల వరద పారించింది. రెండో మ్యాచులో 129 బంతుల్లోనే 14 బౌండరీలు, 1 సిక్సర్‌ ద్వారా 135 పరుగులు సాధించింది. అంతకు ముందు తొలి మ్యాచులో 84 పరుగులు చేసింది. తాజాగా ఈ 21 ఏళ్ల క్రీడాకారిణి బాటా స్పోర్ట్‌ వేర్‌ బ్రాండ్‌ ‘పవర్’కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ‘అత్యంత ప్రతిభగల స్మృతి యువతకు ఆదర్శంగా ఉండగలదు. ఆమె మా అంబాసిడర్‌గా ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉంది’ అని బాటా ఇండియా ప్రతినిధి సందీప్‌ కటారియా అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com