వాత్స్యాయనుడు ఎవరు?

మనదేశంలో పుట్టిన శాస్త్రాలెన్నో ఉన్నా.. వాత్స్యాయన ముని రచన వాత్స్యాయన కామ సూత్రాలు అనబడే కామకలా శాస్త్రము ప్రపంచ ప్రఖ్యాతి చెంది నేటికి నిత్య నూతనంగా ఉంది. నాటి నుండి నేటి వరకు సెక్స్ సైంటిస్టులు వారి పరిశోధనలకు మూల నిధి అయ్యింది. దాదాపు 1250పైగా కామా సూత్రాలతో ముప్పై ఆరు ఆద్యాయనాలు గా ఉన్న వాత్స్యాయన కామ సూత్రాలు ప్రపంచంలోని ప్రధానమైన భాషలన్నిటిలోకి అనువదింపబడి ఎంతో ప్రాముఖ్యత పొందింది. ముందుగా సర్ రిచర్డ్ బర్టన్ , ఎన్.ఎఫ్.అర్బత్ , ఎం.ఎఫ్ నాట్ లు ఇంగ్లిష్ లోకి అమువదించారు. ఈ ఆంగ్లాను వాదం 1883 వ సంవత్సరంలో లండన్ నుండి వెలువడింది. దీన్ని అనుసరించే అనేక భాషల్లోకి వాత్స్యాయన కామ సూత్రాలు అనువదింపబడి జరిగింది. చాల దేశాల్లో ప్రాచీన కాలంలో రచనలు కావించబడిన ప్రేమ, శృంగార గ్రంధాలు ఎన్నో ఉన్నాయి. అయితే రచయితా ఊహను సారంగా సాగాయే గానీ శాస్త్రీయ నిరూపనలేనివి. పాశ్చాత్య దేశాల్లో స్త్రీ, పురుషుల లైంగిక సంబందాల పై హవలాక్ ఎల్లిస్ రచన ప్రసిద్ది గావించింది. ఆ రాదహ్నలో కూడా హవలాక్ ఎల్లిస్ భారతీయ విధానాలు, వాత్స్యాయన కామ సూత్రాలు పరిశోధించిన వారిలో ఒకడు. వాత్స్యాయనుకి ముందు కామ శాస్త్రం ఉన్నట్లుగా చాలామంది ప్రాచీన పండితులు చెపుతుంటారు. మానవ జీవితానికి ధర్మార్ధ కామ మోక్షాలు ప్రధానమైనవిగా వేదాలు చెపుతున్నాయి. అందులో ధర్మాన్ని మాత్రమె తీసుకుని వైవస్వత మానవు ధర్మ శాస్త్రం రచించాదట. దేవా గురువైన బృహస్పతి అర్ధాన్ని మాత్రమె ఆధారంగా తీసికుని అర్దారికారికమైన శాస్త్రం రచించాడు. తరువాత మిగిలిన కామ శాస్త్రాన్ని నందీశ్వరుడు వేయి అద్యాయలు కామ సూత్రాలుగా రచించాదట. ఆ తరువాత దీన్ని శ్వేత కేతువు సంగ్రహించి ఐదొందలు అద్యాయలు కామ శాస్త్రం రచించాదట. దాన్నే ఇంకా సంక్షిప్తంగా పాంచాల దేశస్తుడైన భాభ్రవ్యుడు 150అద్యాయనాలుగా కామ శాస్త్రాన్ని మల్సిహాదట. కాంక్రమేపి వేశ్యాల పరిస్థితులను వారి కామ కళను మాత్రమె విడిగా తీసుకుని పాటలీ పుత్రంలోని దత్తకుడు ప్రత్యెక కామ కళా గ్రంధాన్ని రూపొందించాదట. కానీ ఈ రచనల్ని కాలక్రమేనా మరుగున పడిపోయాయి. భాభ్రవ్యుడి కామ శాస్త్రం సంపూరనమినదే గాని చాలా పెద్దది, చదవడానికి సాధ్యం కానీది అయిపొయింది. పూర్వాచార్యులు వివరించిన శాస్త్ర విషయాలను వాత్స్యాయనుడు బాగా యోచించి పరిశోధించి ఎన్నో మనసకి పరిస్థితులను ఊహించి అందరికి అర్ధమయ్యేలా సంక్షిప్తంగా పటన యోహ్యంగా ఆచరణ ప్రయోజనంగా ఒక శాస్త్రాన్ని పొందుపరచి దానికి కామ సూత్రం అని పేరు పెట్టడం జరిగింది. వాత్స్యాయనుడిచే రూపొందించబడిన దీనికి వాత్స్యాయన కామ సూత్రాలు అనే పేరు సార్ధకమైంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com