వామ్మో భార్యలో!

ఎంతటి వారైనా ఒక్కోసారి భార్య మాట వినాల్సిందే. భార్యకు భయపడాల్సిందే. టీమిండియాలో పెళ్లి చేసుకున్న ప్రతి క్రికెటర్‌కి వాళ్ల భార్య అంటే భయమేనట. ఈ విషయాన్ని స్పిన్‌ మాంత్రికుడు హర్భజన్‌ సింగ్‌ తెలిపాడు. వరుస పర్యటనలు, టోర్నీల కారణంగా క్రికెటర్లు తమ కుటుంబసభ్యుల కంటే ఎక్కువ సమయాన్ని సహచర ఆటగాళ్లతోనే గడుపుతున్నారు. దీంతో ఇంట్లో వాళ్లకి తెలియని కొన్ని విషయాలు కూడా పక్కవారికి తెలుస్తాయి. ఒక్కోసారి వారు చెబితేనే ఇంట్లో వారికి తెలుస్తోంది. తాజాగా భజ్జీ ఓ చాట్‌ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా టీమిండియా క్రికెటర్లకు సంబంధించిన కొన్ని రహస్యాలను భజ్జీ అభిమానులతో పంచుకున్నాడు. ‘ప్రతి భారత క్రికెటర్‌కి తన భార్య అంటే భయం’ అని తెలిపిన భజ్జీ విదేశీ పర్యటనల్లో ఏ ఆటగాడు ఎక్కువగా భార్యను మిస్‌ అయినట్లు ఫీలవుతుంటాడు అని అడగ్గా ‘ఇంకెవ్వరూ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌’ అని నవ్వుతూ బదులిచ్చాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీ బాగా జోకులు పేలుస్తుంటాడని మరో ప్రశ్నకు జవాబుగా చెప్పాడు. ‘సురేశ్‌ రైనా ఎప్పుడు చూసినా ఫోన్‌తో బిజీగా గడుపుతాడు. ఇక ఆశిష్‌ నెహ్రా మ్యాచ్‌లు ఉన్న రోజుల్లో నిర్వహించే జట్టు సమావేశాలకు ఆలస్యంగా వచ్చేవాడు. ఎక్కడికైనా వెళ్లాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చెబితే జహీర్‌ ఖాన్‌ చాలా ఆలస్యంగా రెడీ అవుతాడు. అందరూ అతని కోసం ఎదురు చూడాల్సిందే. జట్టు మొత్తంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ మంచి భోజన ప్రియుడు’ అని భజ్జీ తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ విజేతగా నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు భజ్జీ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com