వారసత్వం కాపాడటం చాలా కష్టం

రాజకీయాల్లోనూ, వ్యాపారంలోనూ వారసత్వాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తున్న యూత్‌ కాన్‌క్లేవ్‌-2018 సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సులో జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో పరిశ్రమలకు 15 రోజుల్లో అన్ని రకాల అనుమతులు ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. నిర్ణీత గడువులోగా అనుమతి ఇవ్వని అధికారులపై జరిమానా విధిస్తున్నామని చెప్పారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇప్పటి వరకు 6 వేల సంస్థలకు అనుమతి ఇచ్చామని చెప్పారు. కొత్త పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభించిందన్నారు. దేశంలోని ప్రధాన నగరాలకు దీటుగా హైదరాబాద్‌లో వ్యాపారం, మార్కెటింగ్‌కు అవకాశాలున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పారిశ్రామిక రంగంలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చిందని వివరించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com