వాల్‌మార్ట్‌ గెలిచింది

గత కొన్ని రోజులుగా అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటా కొనుగోలు చేస్తోందని వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. వాల్‌మార్ట్‌ దీనిపై అధికారిక ప్రకటన వెలువరించింది. ఫ్లిప్‌కార్ట్‌లో 77శాతం వాటాను 16 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన రిటైల్‌ మార్కెట్లలో భారత్‌ ఒకటని, పరిణామంలో, వృద్ధి రేటులో కూడా అని వాల్‌మార్ట్‌ సీఈఓ డౌగ్‌ మెక్‌మిల్లన్‌ అన్నారు. మార్కెట్లో ఈ కామర్స్‌ వైపునకు మారే దానిలో భాగంగా ఇందులో పెట్టుబడులు పెట్టడం తమకు దొరికిన అవకాశమని ఆయన పేర్కొన్నారు. వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ల మధ్య ఒప్పందం కుదిరిందని ఈరోజు సాఫ్ట్‌బ్యాంకు సీఈఓ కూడా వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్‌లోని తమ 20శాతం వాటాను వాల్‌మార్ట్‌కు అమ్ముతున్నట్లు స్పష్టం చేశారు. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో కొంత వాటా కొనుగోలు చేయనుంది. ప్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్‌ బన్సాల్‌ ఈ డీల్‌ తర్వాత కంపెనీ నుంచి తప్పుకోనున్నారు. 2007లో అమెజాన్‌ మాజీ ఉద్యోగులైన సచిన్‌ బన్సాల్‌, బిన్నీ బన్సాల్‌ కలిసి ఫ్లిప్‌కార్ట్‌ స్థాపించారు. బిన్నీ బన్సాల్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లోని ఇతర వాటాదారులు మిగతా వ్యాపారాన్ని చూసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో వాటా కొనుగోలుతో పాటు వాల్‌మార్ట్‌ అదనంగా కొత్త ఈక్విటీ కోసం మరో రెండు బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.13వేల కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. ఫ్లిప్‌కార్ట్‌కు పోటీ సంస్థ అయిన అమెజాన్‌ కూడా ఫ్లిప్‌కార్ట్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నించింది. కానీ, ఫ్లిప్‌కార్ట్‌ వాల్‌మార్ట్‌ ఆఫర్‌వైపే మొగ్గుచూపింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com