వాళ్లే కావాలి

ప్రముఖ నటుడు జాకీచాన్‌ ఇప్పటికేపలువురు భారతీయ నటీనటులతో కలిసి పనిచేశారు. ‘ది మిత్‌’ చిత్రంలో జాకీచాన్‌ బాలీవుడ్‌ నటి మల్లికా శెరావత్‌తో కలిసి నటించారు. ఇప్పుడు ఇండో-చైనీస్‌ చిత్రం ‘కుంగ్‌ఫూ యోగా’లో సోనూసూద్‌, దిశా పటానీలతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత జాకీ ‘స్కిప్‌ట్రేస్‌-2’లో నటించనున్నారు. అయితే ఈ సినిమాలోనూ భారతీయ భామలే కొత్తవారు కావాలంటున్నారు జాకీ. ఇప్పటికే రమణ్‌ రాఘవ్‌ ఫేం శోభితా ధూళిపాళ, తిలోత్తమ షోమెలు ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయి. మరి కొందరు నటీమణులను ఆడిషన్‌ చేయనున్నారు. జాకీచాన్‌ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి రెన్నీ హార్లిన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో జాకీచాన్‌ హాంకాంగ్‌కి చెందిన డిటెక్టివ్‌ పాత్రలో నటిస్తారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com