వావ్…జానెట్

ఏడుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకున్న గాయని జానెట్‌ జాక్సన్‌ 50 ఏళ్ల వయసులో తొలి సంతానానికి తల్లయ్యారు. ఆమెకు అబ్బాయి పుట్టాడని, తల్లీ బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబసభ్యులు తెలిపారు. ఖతార్‌కు చెందిన వ్యాపారవేత్త విసాం అల్‌ మనాను జానెట్‌ 2012లో పెళ్లి చేసుకున్నారు. గత ఏప్రిల్‌లో ‘అన్‌బ్రేకబుల్‌’ టూర్‌ను హఠాత్తుగా రద్దు చేసుకున్న జానెట్‌ ఇటీవల లండన్‌లో పిల్లలకు కావలసిన సామగ్రి కొంటూ కన్పించారు. తాను కుటుంబంపై దృష్టిపెట్టాలనుకుంటున్నానని ఆమె అభిమానులకు ఇచ్చిన ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. 45 ఏళ్లు దాటాక పిల్లల్ని కంటున్న వార్తలు హాలీవుడ్‌ ప్రముఖుల్లో ఈ మధ్య తరచుగా వినబడుతున్నాయి. ఆస్కార్‌ అవార్డు గ్రహీత హాలెబెర్రీ 47 ఏళ్ల వయసులో రెండో బిడ్డకు తల్లయ్యారు. జాన్‌ ట్రవోల్టా భార్య కెల్లీ ప్రెస్టన్‌ 48 ఏళ్ల వయసులో మూడో బిడ్డకు జన్మనిచ్చారు. థెల్మా అండ్‌ లూయీ ఫేమ్‌ జీనా డేవిస్‌ 46 ఏళ్లకు తొలి సంతానాన్ని కనగా ఆ తర్వాత రెండేళ్లకు కవలపిల్లలకు తల్లయ్యారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com