వాషింగ్టన్ డీసీలో దాసరి జన్మదిన వేడుకలు


దర్శకరత్న స్వర్గీయ దాసరి నారాయణరావు జన్మదిన వేడుక అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని చౌపాతి రెస్టారెంట్ లో ఘనంగా జరిగాయి.ఈ వేడుకలలో సినీ నటులు రాజేంద్రప్రసాద్, రఘు, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, తానా అధ్యక్షులు వేమన.సతీష్, ప్రముఖ జర్నలిస్ట్ నరిశెట్టి ఇన్నయ్య, మాజీ ఐ జి సుందర కుమార్ దాస్ ,యడ్ల హేమ ప్రసాద్ తదితరులు పాల్గొని దాసరికి ఘనంగా నివాళులు అర్పించి ఆయనను కొనియాడారు. ప్రపంచంలో 153 చిత్రాలు తీసి జయప్రదం గా విడుదల చేసిన ఖ్యాతి దక్కించుకొన్న ఏకైక దర్సక నిర్మాత దాసరి నారాయన రావు ఆచంద్ర తారార్కంగా నిలుస్తాడని నటీనటులకు సహాయం చేయడమెకాక దర్సక చక్రవర్థి గా నటుడిగా నిర్మాతగా పేరొందిన నారాయణరావు సాటి లేని దర్సక నిర్మాతని సినీ రంగంలో కుల మతాతంగా అందరినీ ఆదరించిన నారాయనణరావు గొప్ప చరిత్ర చూపారు. కేవలం దర్సకుడుగా కాక, రచయితగా, నిర్మాతగా, కొథ కలాకారులను రంగ ప్రవేసం గావించిన ఖ్యాతి ఆయనకే దక్కుతుందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాజకీయ రంగంలోనూ అత్ప్రయంత ప్రతిభ కనబరచి పార్లమెంట్ లో ప్రవేసించి కొత్త దారులు తొక్కి మెప్పుపొందిన వ్యక్తి నారాయన రావు. పార్లమెంట్ స్పీకర్ మెప్పు పొందిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రశనలు వేసే తీరులో కొత్త ప్రయోగాలు చేసిన వ్యక్తి అని,బిరుదలకు ఆసించక దర్సక రత్న అనేదే తనకు గొప్ప బిరుదని ప్రకటించిన దర్శకుడు నారాయన రావు అని ఆయనను జీవితమంతా కాపాడుతూ వచ్హిన ఆయన భార్య దాసరి పద్మ ఆయనకు అండగా నిలిచి ఆయన పేరు నిలబెట్టినదని
అనేకమంది నటులను కళాకారులను రంగ ప్రవేసం చేయించి నిస్వార్థంగా కళా రంగాన్ని ఆదుకొన్న పేరు నారాయనరావు కు దక్కుతుందని మోహన్ బాబు వంటి నటులు ఆయన పేరు చెప్పుకొని తమకు కళా భిక్ష పెట్టినట్లు చెప్పుకొంటారని యార్లగడ్డ పేర్కొన్నారు. ఉదయం పత్రిక ద్వారా జర్నలిస్ట్ గా పేరు తెచ్చుకొన్న నారాయణ రావు భిన్నరంగాలలో ఆరితేరిన వ్యక్తి అని విభిన్న ప్రయోగాలు చేసి బిరుదుల ప్రలోభాలకు లొంగక తెలుగు తేజం గా నిలిచిన అరుదైన నారాయన రావు చిరస్మరణీయుడని యన్ .ఇన్నయ్య దాసరి సేవలను కీర్తించారు.






More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com