విగ్రహం కూతలు

బాలీవుడ్‌ భామ అనుష్క శర్మకు ఏ నటీనటులకూ దక్కని అరుదైన గౌరవం లభించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల మైనపు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం సింగపూర్‌ శాఖలో అనుష్క విగ్రహానికి చోటు దక్కింది. ఈ మ్యూజియంలో ఇప్పటికే కొందరు బాలీవుడ్‌ తారల విగ్రహాలు ఉన్నప్పటికీ, వాటిల్లో దేనికీ లేని ఓ సరికొత్త సదుపాయంతో అనుష్క విగ్రహాన్ని రూపొందించనుండటం విశేషం. అదేంటో తెలుసా… ఆ విగ్రహం సందర్శకులను పలకరిస్తుందట! వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అనుష్క సెల్ఫీ తీసుకోవడానికి చేతిలో సెల్‌ఫోన్‌ పట్టుకున్న భంగిమలో ఆ విగ్రహాన్ని రూపొందించనున్నారట. అభిమానులు అనుష్క బొమ్మ పక్కన చేరి ఆ సెల్‌ఫోన్‌ను తాకితే ఎంచక్కా ఆమె విగ్రహంతో సెల్ఫీ తీసుకోవచ్చట. అప్పుడు ఆ బొమ్మ వారిని పలకరిస్తూ శుభాకాంక్షలు తెలుపుతుందని, దీంతో స్వయంగా అనుష్కనే మాట్లాడిన అనుభూతి కలుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. భారతీయ సందర్శకుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకే అనుష్క మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే ఆ దిశగా కసరత్తులు మొదలయ్యాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com